మీ కొలస్ట్రాల్ ను సూపర్ గా కంట్రోల్ చేసే ఓ బెస్ట్ రెసిపీ చేసుకుందాం రండి. టమోటాలు, కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సన్నగా స్లిమ్ గా ఉన్నారు...చాలా లావు ఉన్నారు..ఇలా శరీరంతో సంబంధం లేకుండా అందరికి ఒకటే ప్రాబ్లమ్. ఫుడ్ ఛేంజ్ చేస్తే చాలు. ఇప్పుడు మీ కొలస్ట్రాల్ ను సూపర్ గా కంట్రోల్ చేసే ఓ బెస్ట్ రెసిపీ చేసుకుందాం రండి. టమోటాలు, కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చేసిన చట్నీ తింటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. మొదటిది మంచి కొలెస్ట్రాల్ (LDL), రెండవది చెడు కొలెస్ట్రాల్ (HDL). ఒకటి మంచివి..మరొకటి చెడు కొలస్ట్రాల్ . చెడు కొలస్ట్రాల్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ , గుండెపోటు లాంటివి వస్తంటాయి. సో వాటిని నియంత్రించాల్సిందే.
చట్నీ తయారు చేయడం కోసం టమోటాలు 2 నుండి 3, వెల్లుల్లి 2, 3 లవంగాలు, పచ్చిమిర్చి 2 నుండి 3, కొత్తిమీర ఆకులు గుప్పెడు, పుదీనా ఆకులు గుప్పెడు, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ముందుగా టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగులను నీటితో బాగా కడగాలి. వెల్లుల్లి రెబ్బను తొక్క తీయండి. వీటిని మిక్సీ పట్టుకొండి. దీని వల్ల కొలస్ట్రాల్ తగ్గుతాయి.
టమోటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచబరిచి రక్త నాళాలు కుంచించుకుపోకుండా నిరోధిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగా కొలెస్ట్రాల్, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.