Manchu Manoj: మనోజ్ ఇక పై అలా చెయ్యకూడదన్న..సిటీ సివిల్ కోర్టు!

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని... ఆయన పరువుకు నష్టం కలిగించే కామెంట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. 


Published Dec 21, 2024 04:05:00 PM
postImages/2024-12-21/1734777413_manchumanojnew.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు అందరికి తెలిసిందే. కుటుంబకలహాలు కాస్త కోర్టుకెక్కాయి. అయితే మనోజ్ మాటలు తనకు బాధ కలిగిస్తున్నాయని విష్ణు తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మనోజ్ కు చిన్న పాటి వార్నింగ్ ను పాస్ చేసింది. మంచు విష్ణు గురించి యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని... ఆయన పరువుకు నష్టం కలిగించే కామెంట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. 


దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఏదైనా మాట్లాడాలనుకుంటే విష్ణు న్యాయవాదులున్నారు వారితో మాట్లాడవచ్చని తెలిపారు.


మరోవైపు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.  అయితే హైకోర్టు మోహన్ బాబు వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. హైదరాబాద్ లోనే ఉన్నారనే విషయాన్ని అఫిడవిట్ లో కూడా దాఖలు చెయ్యాలని కోరారు. అప్పుడు హైకోర్టు ఆఖరి నిర్ణయాన్ని చెబుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

newsline-whatsapp-channel
Tags : manchu-family social-media manchu-manoj manchu-vishnu family

Related Articles