ఆ మహిళ బదులిస్తూ 26,400 సార్ అని చెప్పి చివరికి చంద్రబాబు ఆ చీరను రూ.25 వేలకు బేరం ఆడి కొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ప్రకాశం జిల్లా మర్కాపురం లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు.
ఓ చీరల స్టాల్ ను కూడా సందర్శించిన చంద్రబాబు... తన భార్య నారా భువనేశ్వరి కోసం ఓ పట్టుచీర కొనుగోలు చేశారు. ఎంతకు అమ్ముతున్నావమ్మా అని అడగగా...ఆ మహిళ బదులిస్తూ 26,400 సార్ అని చెప్పి చివరికి చంద్రబాబు ఆ చీరను రూ.25 వేలకు బేరం ఆడి కొన్నారు.
మంగళగిరి పట్టుచీరలు కూడా ఉండడాన్ని ఆసక్తిగా పరిశీలించారు. షర్టు, పంచె, కండువా సెట్ ను కూడా పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు.
చేనేత మహిళలకు, చేనేత రథం అందించి, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా, ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఒక్క వ్యాన్ ఖరీదు రూ.60లక్షలు. దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభం అవుతుంది. #KutamiStandsForWomen#WomensDay… pic.twitter.com/E8DEKqnDJG — Telugu Desam Party (@JaiTDP) March 8, 2025