ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం రోడ్డు మార్గంలో ఖమ్మం బయలుదేరారు.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించేందుకు రోడ్డు మార్గంలో ఖమ్మం బయలుదేరారు. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం, వరదలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అయ్యింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. అక్కడ పర్యటించి లోతట్టు ప్రాంతాలను స్వయంగా సీఎం పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలోనే సీఎం రేవంత్ బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి, మహబూబాబాద్ టౌన్‌తో పాటు ఆకేరు, మున్నేరు పరివాహక గ్రామాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక ఖమ్మం మార్గమధ్యమంలో కోదాడను విజిట్ సీఎం చేయనున్నట్లు సమాచారం.