పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు టీచర్ల చేతిలో పెట్టారని అన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన భాద్యత టీచర్లపై ఉందని తెలిపారు.టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: వేలాది మంది టీచర్ల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ, స్థానిక సంస్థలటీచర్లతో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను కోరి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయించామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని రేవంత్ తెలిపారు.
తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే.. ఎల్బీ స్టేడియంలో ఉందని చెప్తానని, వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉందని రేవంత్ అన్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు టీచర్ల చేతిలో పెట్టారని అన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన భాద్యత టీచర్లపై ఉందని తెలిపారు.టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
టీచర్లకు అందుబాటులో ఉండాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశానని రేవంత్ అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు పడేలా చూసుకునే బాధ్యత తనదేనని అన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకేకీయ ఉద్దేశం లేదని వెల్లడించారు.