ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్లకు ఎలాంటి పదవులు లేకున్నా అధికారులు కాన్వాయ్ తోపాటు.. . అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కడికి వెళ్లినా రాచమర్యాదలు చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రేవంత్ కుటుంబానికి రాచ మర్యాదలు చేస్తూ.. దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారనే చర్చ ప్రజల్లో జరిగేలా.. కావాలనే ఇదంతా చేశారనే ప్రచారం జరుగుతోంది.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కొందరు సీనియర్లు... సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చదరంగంలో పావులు కదిపినట్లుగా ఒక్కో పావును కదుపుతున్నారట. ఇటీవల ఖమ్మం పర్యటనకు వెళ్తున్న సీఎం సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ స్టేజీని పూలబొకేలతో డెకొరేట్ చేయడం వివాదాస్పదమైంది. విషాదకరమైన పరిస్థితుల్లో ఇలా చేస్తారా.? అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఆ తర్వాత ఖమ్మం పర్యటనలో పార్టీ వెహికల్‌కు క్లాత్ కట్టి గల్లీగల్లీలో తిప్పి కావాలనే రేవంత్ ఇమేజ్ దెబ్బ తీశారనే గుసగుసలు సైతం వినిపించాయి. ఇప్పుడు మళ్లీ నల్లగొండ జిల్లా నుంచి మరో నేత సీఎం రేవంత్ ను ఇరికించే ప్రయత్నం మొదలుపెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆగస్టు 30న భువనగిరిలో జరిగిన సభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంత్రుల దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తనకి అవమానం జరిగిందంటూ అక్కడికి నుంచి వీరేశం అలిగి వెళ్లిపోయారు. అక్కడ ఉన్నవాళ్లు బ్రతిమిలాడే ప్రయత్నం చేసినా ఆగలేదు. అయితే.. ఇది జరిగిన 5 రోజుల తర్వాత తనకు జరిగిన అవమానంపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వేముల వీరేశం. ఇప్పుడు ఈ ఫిర్యాదుతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. నిజంగా ఎమ్మెల్యేకు అవమానం జరిగింది కాబట్టి, ఆ రోజు లేదంటే తర్వాత రోజు వెళ్లి స్పీకర్ కు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా కాకుండా 5 రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశారని ఇప్పుడు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయట.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్లకు ఎలాంటి పదవులు లేకున్నా అధికారులు కాన్వాయ్ తోపాటు.. . అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కడికి వెళ్లినా రాచమర్యాదలు చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రేవంత్ కుటుంబానికి రాచ మర్యాదలు చేస్తూ.. దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారనే చర్చ ప్రజల్లో జరిగేలా.. కావాలనే ఇదంతా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వేముల వీరేశంకు అవమానం జరగడంతో ఓ ముఖ్య నేత దీనిని అదునుగా తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇదే అదనుగా మరింత రచ్చ చేసేందుకు రేవంత్ వ్యతిరేక వర్గం ప్లాన్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వేముల వీరేశంతో స్పీకర్ కు ఫిర్యాదు చేయించారని తెలుస్తోంది. గత కాలంగా రేవంత్ టార్గెట్ గా ఆయన వ్యతిరేకవర్గం పావులు కదుపుతోందని చర్చ సర్వత్రా నడుస్తోంది. అతని కుటుంబం వ్యవహారంతో పాటు హైడ్రా కార్యకలాపాలు, సీనియర్లను పట్టించుకోవడం లేదని ఇప్పటికే హైకమాండ్ కు సైతం ఫిర్యాదుల అందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు.. ఏ చిన్న అవకాశం దొరికినా రేవంత్ ను ఇరికించేందుకు కొందరు సీనియర్లు కాచుకుని కూర్చుని వ్యవహారం నడిపిస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.