BIGBOSS8: విష్ణు ప్రియ కష్టాలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ !


ఇంటి సభ్యులు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు ప్రొమోలు ఉన్నాయి.


Published Oct 16, 2024 01:12:00 PM
postImages/2024-10-16/1729064609_GangavvaEmotionalForVishnupriya17290624262801729062441352.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డుల ఎంట్రీ తో భలే ఇంట్రస్టింగ్ గా తయారయ్యింది. ముక్కు అవినాష్ , తేజ , జబర్ధస్త్ రోహిణి లాంటి వాళ్లు బాగా నవ్విస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. నామినేషన్ రచ్చ కూడా దారుణంగా ఉంది.


ఇంటి సభ్యులు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు ప్రొమోలు ఉన్నాయి. విష్ణుప్రియ గంగవ్వతో మాట్లాడుతూ తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది.  తన తల్లికి నాన్న తో మాట్లాడడం ఇష్టం లేదని అందుకే నాన్నకి దూరంగా ఉన్నామని చెబుతుంది. అయితే గంగవ్వ మీ నాన్న ఎక్కడ ఉంటాడు. ఏం చేస్తాడు..మీకు తోడు ఉండడా అని క్వశ్చన్ చేయగా ..విష్ణు ప్రియ మా నాన్న ఊర్లో ఉంటాడు. మా అమ్మకి వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేదు. నాకు నాన్న ఇష్టం అయినా తప్పక మాట్లాడను. అని చెప్పింది. దీనికి గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.


ఆ తర్వాత మణికంఠ, రోహిణి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగింది. ఈ వారం తాను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయితే గంగవ్వకి బంగారు ముక్కుపుడక చేస్తానని నాగమణికంఠ చెప్పాడు. నాకు కూడా బంగాు వడ్డాణం చేయించాలి అని హరితేజ కోరింది. చేయిస్తానంటూనే బేగంపేట నుంచి తెచ్చి ఇస్తానని తెలిపాడు. మొత్తానికి డే 45 డేస్ ప్రొమో అద్దిరిపోయింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigboss8 vishnu-priya gangavva

Related Articles