చైనా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చనిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలను ఆ వ్యక్తి బతికి ఉంటే ఎలా ఉండేదో అచ్చం అలానే డెత్ బోట్‌లను స్పష్టిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చనిపోయిన మన ఆత్మీయులతో మాట్లాడడం అంటే ఏదో సినిమా అనుకుంటున్నారు కదా...లేదా బ్లాక్ మ్యాజిక్ ...అంతేలే మనకు తెలిసింది అంతవరకే మరి ...కాని చైనా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చనిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలను ఆ వ్యక్తి బతికి ఉంటే ఎలా ఉండేదో అచ్చం అలానే డెత్ బోట్‌లను స్పష్టిస్తున్నారు.
నిజంగా చనిపోయిన వారే మాట్లాడుతున్నారో లేదో తెలీదు కాని ...ఏఐ సాయంతో మీరు బాగా కావాలనుకున్న వారు చనిపోయినవారితో మాట్లాడడం మనసుకు ఎంతో తేలికగా అనిపిస్తుందిగా . ఆ వ్యక్తి బతికి ఉంటే ఎలా ఉండేదో అచ్చం అలానే డెత్ బోట్‌లను స్పష్టిస్తున్నారు.
ఇవి అచ్చం చనిపోయిన మనిషిలానే మాట్లాడతాయి. ఇటీవల ఈ డెడ్ బోట్లకు చైనాలో ఆదరణ పెరుగుతున్నది. కావాల్సిన వారిని పదే పదే కలుసుకోవాలనుకోవడం అక్కడి వారికి మరింత ప్రత్యేకంగా ఉందంటున్నారు. అయితే ఇదే సమయంలో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు సహజంగా వారిని మర్చిపోయే ప్రక్రియకు ఈ డెడ్ బోట్లు ఆటంకంగా మారుతున్నాయని.. మరణించిన మనిషిని మర్చిపోకుండా చేస్తున్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి మరిచిపోకపోతే పిచ్చి వాడిగా మారతాడనేది కొందరి వాదన. మనసుకు ఎంతో కొంత ఊరట కలుగుతుందనేది మరి కొంతమంది వాదన .