ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో థియేటర్ల లోకి సినిమా వచ్చిందంటే గుడ్డిగా వెళ్లి సినిమా చూసేవారు. కథ బాగుండి, హీరో హీరోయిన్లకు నచ్చితే మాత్రం ఆ సినిమా తప్పక హిట్ అయ్యేది. అంతే తప్ప ఆ
న్యూస్ లైన్ డెస్క్: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో థియేటర్ల లోకి సినిమా వచ్చిందంటే గుడ్డిగా వెళ్లి సినిమా చూసేవారు. కథ బాగుండి, హీరో హీరోయిన్లకు నచ్చితే మాత్రం ఆ సినిమా తప్పక హిట్ అయ్యేది. అంతే తప్ప ఆ సినిమాలో ఏం జరుగుతుంది దానిలో తప్పొప్పులు ఎవరూ కూడా వెతికేవారు కాదు. ఒకే విధమైన కథతో అనేక సినిమాలు వచ్చేవి అయినా వాటిని ఎత్తిచూపి ప్రజలు ప్రశ్నించేవారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఏ సినిమా అయినా నిశితంగా గమనిస్తున్నారు. ఏదైనా సినిమాలో డైలాగ్ కానీ, పాట కానీ ఇతర సీన్స్ కానీ కాపీ కొట్టినట్లు అయితే ఈ సినిమా కాపీ అంటూ డైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్లను ఏకీపారేస్తున్నారు.
https://youtu.be/9c7h8I4f6Ns?si=bjCFXxe9q9xFUmAv
అయితే తాజాగా దేవర సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయి అద్భుతమైన ఆదరణ పొందుతోంది. ఓ వైపు ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్న దేవర ట్రైలర్ మరోవైపు కాపీ కొట్టారంటూ ట్రోలింగ్ కు గురవుతోంది. కొన్ని సీన్లను కాపీ కొట్టారని అది కూడా కొరటాల శివ పాత సినిమాల నుంచి ఆ సీన్లను తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమాలోని ఒక డైలాగును ఏకంగా మాజీ సీఎం జగన్ నుంచే కాపీ కొట్టారని అంటున్నారు.
దీనికి సంబంధించిన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే ..కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం అంటూ జగన్ ఒక సభలో అన్నారు. అప్పట్లో ఆ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం దేవర సినిమాలో కూడా సేమ్ ఇలాంటి డైలాగే ఉంది. దీంతో జగన్ నుంచే కొరటాల శివ ఈ డైలాగ్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ట్రైలర్ నిశితంగా గమనించండి. ఆ డైలాగు జగన్ డైలాగు అని తప్పకుండా మీకు తెలుస్తుంది.
https://youtu.be/5cx7rvMvAWo?si=Zc28fhf-NfJpznZ-