Devara: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ అంటూ దేవర ట్రైలర్ రిలీజ్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకేక్కిన మూవీ దేవర.  ఈ చిత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి  షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత  రాబోతున్న చిత్రం కాబట్టి దీనిపై 


Published Sep 10, 2024 07:05:33 AM
postImages/2024-09-10/1725969335_devaratrailer.jpg

న్యూస్ లైన్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకేక్కిన మూవీ దేవర.  ఈ చిత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి  షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత  రాబోతున్న చిత్రం కాబట్టి దీనిపై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ సినిమాను డైరెక్షన్ చేశారట.

అద్భుతమైన కథాంశంతో, మైమరపించే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇంతవరకు  ఎన్టీఆర్ ను ఈ విధంగా ఎవరు చూసి ఉండరు. అలాంటి ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్  రిలీజ్ అయి అద్భుతంగా ఆకట్టుకుంటుంది.  రెండు నిమిషాల 40 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదరహో అనిపించాయి.  ఈ ట్రైలర్ చూస్తే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

"భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి". శానా పెద్ద కథస్వామి రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ మా దేవర కథ" అంటూ  ప్రకాష్ రాజు వాయిస్ ఎంతో ఆకట్టుకుంటుంది. "మనిషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదంటూ" ఎన్టీఆర్  డైలాగుతో మొదలై "కాదు కూడదు  అని ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యాన్ని చంపే భయానవుతా" అంటూ ఎన్టీఆర్ విసిరే డైలాగ్ మరింత గూస్ బంప్స్  తెప్పిస్తోంది.

ఈ విధంగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుద్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అంతేకాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కోసం ఎదురుచూసే విధానం అద్భుతంగా చూపించారు. ఈ విధంగా ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara janhvi-kapoor koratala-shiva devara-trailer

Related Articles