Devara: దేవర నెగటివ్ టాక్.. ఎన్టీఆర్ పై కుట్ర చేస్తుంది వాళ్లేనా..?

దేవర.. దేవర..ఎక్కడ చూసినా థియేటర్లలో దేవర హవానే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే చాలు దేవరకి సంబంధించిన విషయాలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. టీవీ ఆన్ చేసినా దేవర టాకే వినిపిస్తోంది


Published Sep 27, 2024 03:25:00 PM
postImages/2024-09-27/1727427335_devaranagativetalk.jpg

న్యూస్ లైన్ డెస్క్: దేవర.. దేవర..ఎక్కడ చూసినా థియేటర్లలో దేవర హవానే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే చాలు దేవరకి సంబంధించిన విషయాలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. టీవీ ఆన్ చేసినా దేవర టాకే వినిపిస్తోంది. ఇలా ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్ దేవర మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి నుండే దేవరకు సంబంధించిన షోలు పడిపోయాయి.

దీంతో ట్విట్టర్ వేదికగా ఎంతో మంది అభిమానులు సినిమా ఎలా ఉందో పంచుకున్నారు. ఇక కొంతమంది అయితే విపరీతంగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే దేవర సినిమా బాగున్నప్పటికీ కొరటాల డైరెక్షన్ మ్యాజిక్ ఇందులో చూడలేమని తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు కొరటాల ఎలా డైరెక్షన్ చేశారో ఆ డైరెక్షన్ మ్యాజిక్ ఈ మూవీలో కనిపించలేదని తెలుస్తోంది. అయితే మరీ అంత బ్యాడ్ అయితే లేదు. సినిమా బాగుంది.

ఎన్టీఆర్ అభిమానులకు ఇది బ్లాక్ బస్టర్. కానీ కొంతమంది మాత్రం కావాలనే పనిగట్టుకొని మరీ దేవర సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ఎ,న్టీఆర్ నటన, పాటలు అన్నీ బాగున్నాయి.కానీ జాన్వి కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది.ఈమె ఓ నాలుగైదు సన్నివేశాలు తప్ప ఎక్కడ కనిపించలేదు. ఇంటర్వెల్ అయ్యే వరకు కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించకపోవడం ఆమె అభిమానులకు కాస్త నిరాశ అని చెప్పుకోవచ్చు.

ఇక విజువల్స్,స్క్రీన్ ప్లే కాస్త బాగున్నప్పటికీ  ఏదో ఒక దగ్గర కాస్త తేడా అయితే కొట్టింది. అయితే సినిమా బాగోలేదని కాదు యావరేజ్ గా ఉంది. ఒకసారి ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడొచ్చు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ పై కుట్ర చేసి సినిమాపై నెగటివ్ టాక్ వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఇక సినిమా కథ బాగుంటే ఎంత నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా సినిమాకి ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara janhvi-kapoor koratala-shiva

Related Articles