దేశంలో సంచలనం సృష్టిస్తున్న కుక్క మాంసం కేసులో కీలక నిందితుడు కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ రజాక్ అని తేలింది.
న్యూస్ లైన్ డెస్క్ : దేశంలో సంచలనం సృష్టిస్తున్న కుక్క మాంసం కేసులో కీలక నిందితుడు కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ రజాక్ అని తేలింది. పలు చర్చా కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ తరపున ఆయన చాలాసార్లు మాట్లాడారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సీనియర్ లీడర్ డీకే శివ కుమార్ లకు అబ్దుల్ రజాక్ చాలా ఆప్తుడు.
కర్ణాటకలో తెల్లవారుజామునే అమ్ముడుపోయే మటన్ బిర్యానీకి చాలా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం మార్నింగ్ మటన్ బిర్యానీ గురించి చాలా వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. తక్కువ రేటుకే రుచికరమైన మటన్ బిర్యానీ దొరుకుతుండటంతో జనాలు ఎగబడ్డారు. అయితే.. అది మేక మాంసం కాదని.. కుక్క మాంసంతో చేసిన బిర్యానీ అని తేలడంతో జనాలు అవాక్కయ్యారు. కొన్నేళ్లుగా కుక్క మాంసంతో బిర్యానీ చేసి మటన్ బిర్యానీగా నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బిజినెస్ అంతా అబ్దుల్ రజాక్ అనే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత అని విచారణలో తేలింది.
రాజస్థాన్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న 14వేల కిలోల కుక్క మాంసాన్ని రైల్వే స్టేషన్ మేజిస్టిక్ సమీపంలో పట్టుకున్నారు. బెంగళూరు కేంద్రంగా అబ్దుల్ రజాక్ ఈ దందా నడిపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కాగా.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. పట్టుబడింది కుక్క మాంసం కాదని.. ఒరిజినల్ మాంసమే అన్నారు. కాగా.. ల్యాబ్ అధికారులు ఆ మాంసం కుక్క మాంసమే అని తేల్చారు.