ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఫేమస్ నటీనటులంతా వరుసగా మరణిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మొదలు చలపతిరావు వరకు ఎంతోమంది సీనియర్ నటినటులు హీరోలు, హీరోయిన్లు మరణిస్తూ మనకు దూరం అవుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఫేమస్ నటీనటులంతా వరుసగా మరణిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మొదలు చలపతిరావు వరకు ఎంతోమంది సీనియర్ నటినటులు హీరోలు, హీరోయిన్లు మరణిస్తూ మనకు దూరం అవుతున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీకి విలన్ గా ఎంతో పరిచయమైనటువంటి మోహన్ రాజ్ తాజాగా కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం మూడు గంటల సమయంలో తిరువనంతపురంలోని కంజీరం కులంలో తన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచారట..
మోహన్ రాజ్ మృతిపై మలయాళ ఇండస్ట్రీ కాకుండా తెలుగు ఇండస్ట్రీ కూడా తీవ్రమైన దిగ్బాంతి వ్యక్తం చేసింది. అయితే ఈయన 1988లో మూనం మూర అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అలా ఎన్నో చిత్రాల్లో విలన్ గా నటించిన ఆయనకు బాగా పేరు తీసుకువచ్చిన సినిమా కిరీడం. ఈ చిత్రం భారీ విజయన్ని అందుకోవడమే కాకుండా ఆయనను విలన్ గా నిలబెట్టింది. అలాంటి మోహన్ రాజ్ మలయాళ, తమిళ్, తెలుగు, భాషల్లో మొత్తం 300 పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు.
ముఖ్యంగా తెలుగులో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, హీరోలుగా వచ్చిన చిత్రాల్లో ప్రధాన విలన్ గా చేశాడు. ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, పోకిరి రాజా, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, శివయ్య, శివమణి, వంటి చిత్రాల్లో ప్రధానమైన విలన్ గా చేశాడు. ఈయన చేసిన ఈ చిత్రాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్. ఇక చివరిగా మోహన్ రాజ్ మమ్ముట్టి నటించినటువంటి మోర్ సాచ్ అనే మూవీలో కనిపించారు.
ఇక ఈ చిత్రం తర్వాత మోహన్ రాజ్ మధురైలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారట. అయితే ఆయన గత మూడు సంవత్సరాలుగా అరుదైన వ్యాధితో పోరాడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.