ఇప్పుడు పైన ఫిష్ ప్రై కి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసి పేస్ట్ చేసి ఉంచుకొండి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: : పిష్ ఫ్రై చెయ్యాలంటే బెస్ట్ వే ఇదే...స్పైసీ గా ..కాస్త క్రీస్పీ గా మరింత సాఫ్ట్ గా భలే టేస్టీ గా ఉంటుంది.
ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:
చేపలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఆయిల్. ఇవి రెడీ గా ఉంచుకుంటే మీ ఫిష్ ప్ర చాలా ఈజీగా అయిపోతుంది.
మంచి ఫిష్ తీసుకొండి. వంజరం...పాంప్లెట్స్ ....ఇలా పెద్ద చేపలు తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. చేపల ముక్కలను నీచు వాసన రాకుండా పసుపు , ఉప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు పైన ఫిష్ ప్రై కి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసి పేస్ట్ చేసి ఉంచుకొండి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగ పిండి, బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు పట్టించండి. చిన్న లెమెల్ వేస్తే అధ్భుతంగా ఉంటుంది.
నెక్ట్స్ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. సిమ్ లో పెట్టి ఫ్రై చెయ్యండి. సూపర్ ఉంటుంది. అంతేకాదు ...ఫ్రై అయ్యాక పీసెస్ మీద లైట్ గా కారం ఉప్పు చల్లి నిమ్మకాయ రసం పిండితే ...నెక్స్ట్ లెవెల్ అంతే.