అల్లం చిన్న చిన్న ముక్కలు కాని చేసి తెల్లవారే ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. శరీరంలో జరిగే మార్పులు మీరు చూడాల్సిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; అల్లం తింటే మంచిది ఇంత వరకు అందరికి తెలిసిందే. పెద్దలు చెప్పారు అల్లం కంపల్సరీ తిని తీరాల్సిందే. అసలు ఎందుకు తినాలో ..తింటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో చూద్దాం. అల్లం రసం కాని అల్లం చిన్న చిన్న ముక్కలు కాని చేసి తెల్లవారే ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. శరీరంలో జరిగే మార్పులు మీరు చూడాల్సిందే.
*అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
* అల్లం రసం తాగడం వల్ల కొవ్వు కణాల విచ్ఛిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.
*అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. హార్ట్ స్ట్రోక్స్ రావు. బ్లడ్ లో క్లాట్స్ ఉండవు. కణుతులు పుట్టవు.
* అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి.
*ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పిని దూరం చేస్తుంది. వాంతులు, వికారం ప్రయాణ అనారోగ్యానికి సహజ చికిత్సగా పనిచేస్తుంది.
* అల్లం రసం ఎలా తయారుచేసుకోవాలి...
మొదట కాస్త అల్లం తీసుకొని...మెత్తగా రుబ్బుకొండి. ఆ రసాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో కాస్త తేనె , నిమ్మరసం కలుపుకొండి . 5 లోపు పిల్లలకు పట్టకండి. వేడి చేస్తుంది. కాని 6 యేళ్లనుంచి పిల్లలకు మోతాదులో ఇస్తే మంచిది.