Priyanka chopra: నేను అథ్లెట్ నే అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక హాట్ షో.!

ఒలంపిక్స్ జరుగుతున్న తరుణంలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నేను కూడా అథ్లేట్ నే అంటూ  స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని హాట్ లుక్ లో స్కిన్ టైట్ స్పోర్ట్స్ దుస్తువుల్లో నిజంగా స్పోర్ట్స్  ఆడే  అమ్మాయిలానే కనిపిస్తోంది.  


Published Aug 02, 2024 03:19:51 AM
postImages/2024-08-02/1722586659_priyankachopra.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా  ఒలంపిక్స్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే ఫ్రాన్స్ లో ఒలంపిక్స్ మొదలై వారం రోజులు కావస్తోంది.  ఇందులో అన్ని దేశాల అథ్లెట్స్ పాల్గొన్నారు.  ఇండియా నుంచి కూడా చాలామంది వివిధ విభాగాలలో  అథ్లెట్లు దూసుకుపోతున్నారు.

దీంతో ఇండియాకు ఎన్ని పథకాలు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఒలంపిక్స్ జరుగుతున్న తరుణంలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నేను కూడా అథ్లేట్ నే అంటూ  స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని హాట్ లుక్ లో స్కిన్ టైట్ స్పోర్ట్స్ దుస్తువుల్లో నిజంగా స్పోర్ట్స్  ఆడే  అమ్మాయిలానే కనిపిస్తోంది.  బ్లాక్ మరియు క్రీం కలర్ కాంబినేషన్ దుస్తుల్లో అమ్మడు స్కిన్ షో చేస్తోంది.  

కాళ్లకు షూస్ మోకాళ్లకు అలాగే మోచేతుల కు సేఫ్టీ బాండ్స్ ధరించి సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ చూసిన చాలామంది ఆమె అభిమానులు ప్రియాంక ఫిట్నెస్ అథ్లేట్లకు ఏమాత్రం తక్కువ కాదని కామెంట్లు పెడుతున్నారు. ప్రతిరోజు వర్కౌట్లు చేసి తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ ఉంటుంది.

ఇప్పటికే ఈమె స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బాక్సర్ మేరీకోమ్ బయోపిక్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రియాంక చోప్రా కు ప్రత్యేకమైన గుర్తింపు అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన విషయం అందరికీ తెలుసు.  అలాంటి ఈ తరుణంలో ఈమె అథ్లెట్ లా రెడీ అయి స్కిన్ షో చేయడంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/C-H3OcCpgkv/?igsh=aTNvMmk5OTR2aGc5

newsline-whatsapp-channel
Tags : priyanka-chopra newslinetelugu parisolympics olympic2024- mericom

Related Articles