రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ప్రకటించింది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇక మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ. 5 లక్షల సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో రాష్ట్రానికి తీవ్రనష్టం వటిల్లిందని అన్నారు. ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో 6, కొత్తగూడెం 5, ములుగు 4, కామారెడడ్ఇ 3, వనపర్తిలో ముగ్గురు మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రతి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, రూ.5లక్షల పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సాయం ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని వరద బాధితుల కోసం 158 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించగా 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.