కుక్కర్ లో కొన్ని ఫుడ్స్ వండడం చాలా ప్రమాదకరం. అయితే అందులో కొన్ని ఐటమ్స్ మాత్రం కుక్కర్ లో వండడం చాలా విషపూరితమైనది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కుక్కర్ లో వంటచెయ్యడం ఎంత సులువు. అసలు పెట్టి పక్కకు వెళ్లేసరికే ..కుయ్యి మంటు ఫుడ్ రెడీ చేసేస్తుంది. అసలు ఈ రోజుల్లో కుక్కర్ వంటలు చాలా సాధారణం. అయితే కుక్కర్ లో వంటచేస్తే దాని నుండి నురుగు బయటకు వస్తుంది. అది శరీరాన్ని చేరి జీర్ణవ్యవస్థను పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుక్కర్ లో కొన్ని ఫుడ్స్ వండడం చాలా ప్రమాదకరం. అయితే అందులో కొన్ని ఐటమ్స్ మాత్రం కుక్కర్ లో వండడం చాలా విషపూరితమైనది.
* ఫ్రై లు ఏవైనా కుక్కర్ లో చెయ్యకండి. కారణం ఆ నూనె వేడికి ..అల్యూమినియమ్ పార్టికల్స్ ఆయుల్ లో కలవడమే కాదు....ప్రెజర్ కుక్కర్ ఎక్కువ వెయించడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
* నూడుల్స్ ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి కాబట్టి వాటిని ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ఎక్కువ ఉడికితే మైదా అతిగా ఉడికి ...రియాక్షన్ జరుగుతుంది. అసలు మంచిది కాదు.
* ఆకుకూరలు పాలకూర వంటి ఆకుకూరలను కుక్కర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కుక్కర్ లో ఉడికించడం వల్ల ప్రొటీన్స్ పోవడమే కాదు. ఆరోగ్యానికి ప్రమాదం కూడా.
* కేక్ తరచుగా ప్రజలు ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్‌లో కేక్‌ను తయారుచేస్తారు. కానీ ఇలా తయారు చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అనేది వంట కోసం తయారు చేయబడింది, బేకింగ్ కోసం కాదు. సో మీరు కేక్ ని చక్కగా ఓవెన్ లో బేక్ చెయ్యండి.