Niharika: నిహారిక పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిందా.?

పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వంలో కీలక లీడర్గా ఉన్నారు. అలాంటి పవన్ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.  చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని  ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.  తర్వాత రాజకీయ వారసత్వాన్ని కూడా అన్న ద్వారానే పొంది రెండు తెలుగు రాష్ట్రాలలోనే అద్భుతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.  టిడిపి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కూతురు నిహారిక చాలా సందర్భాల్లో తన బాబాయి గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721626052_kkk.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వంలో కీలక లీడర్గా ఉన్నారు. అలాంటి పవన్ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.  చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని  ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.  తర్వాత రాజకీయ వారసత్వాన్ని కూడా అన్న ద్వారానే పొంది రెండు తెలుగు రాష్ట్రాలలోనే అద్భుతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 టిడిపి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కూతురు నిహారిక చాలా సందర్భాల్లో తన బాబాయి గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది. కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రం ఆగస్టు 9  రిలీజ్ కు సిద్ధమైంది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా ఉన్న నిహారిక ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ  ఇప్పటివరకు మాకు మీ అందరికీ మా బాబాయ్ పవర్ స్టారే.

ఎన్నికల ఫలితాల రోజు మా ఫ్యామిలీ అంతా టీవీ ముందే కూర్చున్నాం. ఇక మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది.  బాబాయ్ స్పీచ్ లు చాలా బాగుంటాయని నన్ను ఎంతో మోటివేట్ చేశాయని, ఆయన ఇంట్లో అయినా,సినిమాలు అయినా, రాజకీయాల్లో అయినా స్టారే అంటూ  చెప్పుకొచ్చింది. ఆయనను ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే చూడడానికి ఇష్టపడతామని తెలిపింది.

నిహారిక తన బాబాయ్ నెంబర్ ను తన ఫోన్లో ఏమని సేవ్ చేసుకుందో చాలామందికి తెలియదు.  అయితే పవన్ కళ్యాణ్ పేరును KKK అని సేవ్ చేసుకుందట. KKK అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అని  సేవ్ చేసుకున్నానని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan niharika konidela-kalyan-kumar committee-kurrallu-movie

Related Articles