TTD: తిరుమలలో భక్తుల రద్దీ..ఎంత టైం పడుతుందంటే ?

శుక్రవారం భక్తుల రద్దీ కాస్త తగ్గినా రాత్రి నుంచి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.


Published Aug 18, 2024 08:49:00 AM
postImages/2024-08-18/1723951177_1084424dc.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. సెలవు రోజు కావడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారం భక్తుల రద్దీ కాస్త తగ్గినా రాత్రి నుంచి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,462 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.


శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. క్యూలైన్లు,కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు టిఫెన్లు, మంచినీళ్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ఈ ఉత్సవాలు ఆరంభమైన విషయం తెలిసిందే. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు.


 సెలవు రోజు కావడంతో  ఒక్క రోజే హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. తిరుమల దర్మనానికి వెళ్లే వారు..ఈ సమయాన్ని చూసుకోవాలని కోరారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatewsra-temple tirupati

Related Articles