100 గ్రాముల పెరిగారు..ఏం చేసినా ఇప్పుడు బంగారు పతకంపోయిందిగా అంటూ ఓ ఎమోజీని యాడ్ చేశారు హేమామాలిని.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిజానికి బరిలోకి దిగి ఆడడం కష్టం...అదే బయట నిలుచొన నోరు పారేసుకోవడం చాలా సులువు...సీనియర్ నటి హేమామాలిని అదే చేశారు. అడుగు దూరంలో తన కల చెదిరిపోయిందని బాధపడుతున్న వినేశ్ పై మరిన్ని చురకలు విసిరారు. గత రెండు ఒలంపిక్స్ లో జరిగిన అనుభవాలు మరిచిపోయే అవకాశం వినేశ్ కు దక్కింది. కాని ఏం చేస్తాం..బరువు చూసుకోవాలి గా ...100 గ్రాముల పెరిగారు..ఏం చేసినా ఇప్పుడు బంగారు పతకంపోయిందిగా అంటూ ఓ ఎమోజీని యాడ్ చేశారు హేమామాలిని.
వినేశ్ పరిస్థితి యావత్తు భారత్ కు అర్ధమయ్యింది. కాని హేమామాలినికి మాత్రం అర్ధం కాలేదు. తనకు మధ్ధతు ఇవ్వకపోయినా పర్వాలేదు కాని తనను వెక్కిరించినట్లు మాట్లాడడం మాత్రం తప్పంటున్నారు నెటిజన్లు ఇంతకీ ఆవిడ ఏం చెప్పిందంటే .... ‘ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అలాగే, వింత. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది. సరైన శరీర బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కళాకారులకు, మహిళలకు ఇదొక గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్ పతకమైతే రాదు కదా’ అంటూ వ్యంగ్యంగా నవ్వారు హేమ మాలినీ.
ఈ మాటలకు వినేశ్ కు ఏమో కాని ...జనాలకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. ఏం మేడం మ్యాటర్ తెల్వదా మీకు...2 కేజీలు పెరిగింది. ఒక్కరోజులో అంత వెయిట్ ఎలా పెరిగింది. అది కూడా రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తుంటే బరువు ఎలా పెరుగుతారు. పెరిగినా ...కోచ్ లు ...డాక్టర్లు తనకు అదనంగా ఉన్న రక్తాన్ని తీసేశారు...జుట్టును కత్తిరించారు. అయినా 100 గ్రాములు ఎక్కువగా ఉంది. తప్పుఎవరిదైనా కాని ...వినేశ్ ను తప్పుపట్టడం బాగాలేదు అంటున్నారు నెటిజన్లు.