తన కుటుంబ సమేతంగా సంధ్య థియేటర్ కు చేరుకున్నారు. అక్కడ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ తల్లి కొడుకు చనిపోయారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. డిసెంబర్ 4 సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియం షో కు అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా సంధ్య థియేటర్ కు చేరుకున్నారు. అక్కడ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ తల్లి కొడుకు చనిపోయారు. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంథ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా తాజాగా బన్నీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.