ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లు కాపురాలు చేసిన జయం రవి ఆర్తి, ధనుష్ ఐశ్వర్య, జీవి ప్రకాష్ సైంధవి వంటి సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లు కాపురాలు చేసిన జయం రవి ఆర్తి, ధనుష్ ఐశ్వర్య, జీవి ప్రకాష్ సైంధవి వంటి సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా మంది అభిమానులకు బాధాకరం.అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. తాజాగా ఓ నటి ఏకంగా నాలుగో పెళ్లికే రెడీ అయింది.మరి ఆమె ఎవరు.. నాలుగో పెళ్లి నిజంగానే చేసుకోబోతుందా.. అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ అంటే అందరికీ సుపరిచితమైన హీరోయినే.ఈమె నరేష్, పవిత్ర లోకేష్ ల బయోపిక్ గా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా చూస్తే గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో నటించి అదరగొట్టేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా కొరియోగ్రాఫర్ అయినటువంటి రాబర్ట్ ని నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అయితే ఇప్పుడు వరకు తనకు రెండు పెళ్లిళ్లే అయ్యాయని మూడో పెళ్లి కాలేదని ఈ నటి ఆ మధ్య కాలంలో చెప్పింది.
అయితే ఆకాష్ నీ మొదట పెళ్లి చేసుకొని ఆయనకు డివోర్స్ ఇచ్చి తర్వాత ఆనంద్ ని రెండో పెళ్లి చేసుకుని ఆయన కి కూడా విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది.కానీ పెళ్లి కాలేదు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది.మా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయింది అంటూ షాక్ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి అని అంటూ ఉంటారు.
అయితే తాజాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్ ని నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంతేకాదు అక్టోబర్ 5 న పెళ్లి ముహూర్తం అంటూ కూడా డేట్ ఫిక్స్ చేసుకొని అభిమానులతో పంచుకుంది. అయితే పీటర్ పాల్ కంటే ముందే కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొద్దిరోజులు డేటింగ్ చేసింది. కానీ పీటర్ పాల్ ఎంట్రీ తో వీరి మధ్య బ్రేకప్ జరిగింది. అయితే ప్రస్తుతం పీటర్ పాల్ పక్కకు తప్పుకోవడంతో మళ్ళీ వీరి మధ్య ప్రేమ చిగురించి తాజాగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు.