HEALTH: ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రొటీన్ పౌడర్ ..మీ కోసం ..!

ఒక్క సారి ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ను తయారుచేసి చూడండి.  రెడీ మేడ్ పౌడర్లు చాలా ప్రమాదం . అందులో చక్కెర స్థాయి పెరుగుతుంది.


Published Jul 30, 2024 09:18:48 AM
postImages/2024-07-30/1722349103_20190404153418.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్  చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పాలు కలుపుతాం...దాంట్లో బూస్ట్ , ప్రోటీన్ పౌడర్స్ కలుపుతూ ఉంటాం. ఒకే ఒక్క సారి ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ను తయారుచేసి చూడండి.  రెడీ మేడ్ పౌడర్లు చాలా ప్రమాదం . అందులో చక్కెర స్థాయి పెరుగుతుంది.


పిల్లలకు బోన్ ఫిట్ నెస్ కోసం జుట్టు మరియు చర్మానికి కూడా ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ మనకు ఆహారంలో లభిస్తూనే ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ కోసం వెంట పడకండి. చక్కగా ఇంట్లోనే కరెక్ట్ గా వెజ్జీస్ , ఫ్రూట్స్ , నట్స్ తో పౌడర్ ను తయారు చేసుకోవచ్చు.


ఈ హోం మేడ్ ప్రోటీన్ తయారీకి కావాల్సిన పదార్థాలు..


ఆపిల్ - పావు కిలో..
క్యారెట్ - పావు కిలో
బీట్‌రూట్ - పావు కిలో
చెక్కర. పావు కిలో
 బెల్లం - పావు కిలో
బాదం - 100 గ్రా
పిస్తా - 100 గ్రా
ఏలకులు - 10
ఇంట్లో ప్రొటీన్‌ పౌడర్‌ తయారు చేసేందుకు ముందుగా యాపిల్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని మంచిగా  తురుముకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఓ బాణలిని ఓవెన్‌లో పెట్టి బాదం, పిస్తా, యాలకులు వేసి బాగా వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కు వ రోజులు నిల్వ చెయ్యాలంట చాలా మెత్తగా పౌడర్ అయ్యేలా చూసుకొండి. 


దీని తరువాత, స్టవ్ వెలిగించి ఒక  పాత్రను ఉంచి, దానికి రుబ్బిన పేస్ట్ వేసి బాగా వేయించాలి. తర్వాత దే చక్కెర బెల్లం పొడి వేసి బాగా కలపాలి. నీళ్లు వంపేసి చిక్కగా అయ్యాక అందులో బాదం, పిస్తా, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మోస్టీ్లీ చల్లరాక ఇంకాస్త మెత్తగా పౌడర్ చేసుకుంటే సరి..హెల్దీ ప్రొటీన్ పౌడర్ రెడీ.


గాలి చొరబడని గాజు కంటైనర్‌లో దీన్ని ఉపయోగించండి. చెడిపోకుండా రెండు నెలల వరకు ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్  గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలే కాదు.

 పెద్దవాళ్లు కూడా దీనిని తాగొచ్చు. 
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది
స్కిన్ టోన్‌ని మెయింటెయిన్ చేస్తుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఎముకల ఆరోగ్యానికి మంచిది 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu health-news protin

Related Articles