Hyper Aadi:హైపర్ ఆది నన్ను మోసం చేశాడు..అందుకే జబర్దస్త్ మానేశా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. అలాంటి వారిలో పంచ్ కమెడియన్  ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుపచ్చేది హైపర్ ఆది మాత్రమే. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా  పలు టీవీ షోలో నటిస్తూ 


Published Jul 28, 2024 03:52:02 AM
postImages/2024-07-28/1722155347_adi.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. అలాంటి వారిలో పంచ్ కమెడియన్  ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుపచ్చేది హైపర్ ఆది మాత్రమే. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా  పలు టీవీ షోలో నటిస్తూ ఉంటారు. అలా హైపర్ ఆది ఓవైపు సినిమాల్లో, మరోవైపు రియాలిటీ షోలలో మరియు రాజకీయ సమావేశాల్లో ఇలా ఎంతో బిజీ నటుడిగా మారిపోయారు.

ఈయన ఎంత స్థాయికి వెళ్ళినా కానీ ఆయనకు లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అని చెప్పవచ్చు. కేవలం హైపర్ ఆదికే కాకుండా దన్ రాజు, వేణు వంటి వారు కూడా జబర్దస్త్ ద్వారానే ఇండస్ట్రీలో ఎదుగగలిగారు. వీరందరిలో కెల్లా హైపర్ ఆది చాలా డిఫరెంట్.  కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.  ఇలా సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నటువంటి హైపర్ ఆది వల్ల ఒక నటి జబర్దస్త్ నుంచి వైదొలిగి పోయిందట.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.  ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరయ్యా అంటే  రీతు చౌదరి. ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు రియాలిటీ టాక్ షోలకు హోస్టుగా చేస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను షేర్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఆదితో కలిసి జబర్దస్త్ షోలను స్కిట్స్ చేసేదట.

 ఆది ఎప్పుడైతే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారో అప్పటినుంచి తను ఒక్కతే అయిపోయిందట. అక్కడ ఉండడం ఇష్టం లేక ఆమె కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిందట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  దీంతో నేటిజన్స్ హైపర్ ఆది ఎందుకు ఈమెను మోసం చేశావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jabardasth comedians hyper-aadi rithu-chowdary

Related Articles