Jayaprada: Sr.NTR నా బ్యాక్ పై గుద్దడం వల్ల 3రోజులు లేవలేదు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉందంటే దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ను నటసార్వభౌముడు అంటారు. ఆయన ఏదైనా చేస్తే అందులో నటించడం కాదు జీవించేవాడు.


Published Jul 09, 2024 06:17:55 PM
postImages/2024-07-09//1720529275_Untitleddesign6.png

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉందంటే దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ను నటసార్వభౌముడు అంటారు. ఆయన ఏదైనా చేస్తే అందులో నటించడం కాదు జీవించేవాడు.

Sr. ఎన్టీఆర్ తో నటించాలంటే ఇతర హీరోయిన్లు చాలా భయపడిపోయేవారట. అలా సీనియర్ ఎన్టీఆర్  తో జయప్రద ఓ సినిమాలో నటించింది. ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్ ఆమె బ్యాక్ పై  గట్టిగా కొట్టడం వల్ల ఆమెకు మూడు రోజులు జ్వరం వచ్చి పడుకుందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సీనియర్ ఎన్టీఆర్ తో వాణిశ్రీ,జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు ఎన్నోసార్లు నటించారు. అలా ఆయనతో నటించిన చాలామంది హీరోయిన్లు ఛాన్స్ దొరికినప్పుడల్లా సీనియర్ ఎన్టీఆర్ తో వారు చేసిన సినిమాల గురించి తెలియజేస్తూ ఉంటారు.  అలాగే జయప్రద మరియు జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రోగ్రాం లో కలిసి పాల్గొన్నారు.

 ఈ సందర్భంలోనే జయప్రద మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ తో ఆమె చేసినటువంటి పాటకు సంబంధించిన సన్నివేశాన్ని  చెప్పుకొచ్చింది. యమగోల, అడవి రాముడు వంటి ఎన్నో చిత్రాల్లో ఈమె సీనియర్ ఎన్టీఆర్ తో నటించింది. యమగోల సినిమాలో 'ఓలమ్మి తిక్క రేగిందా' అనే సాంగ్  షూటింగ్ సమయంలో  ఎన్టీఆర్ తన బ్యాక్ పై గట్టిగా కొట్టారట. అలా పాట అయిపోయేసరికి ఎన్నోసార్లు తన బ్యాక్ పై గట్టిగా గుద్దాడని, ఆయన ఎనర్జీ తట్టుకోలేక నాకు మూడు రోజులపాటు హై టెంపరేచర్ ఫీవర్ వచ్చిందని,ఒళ్లంతా నొప్పులు వచ్చాయని నవ్వుతూ జయప్రద చెప్పుకొచ్చింది. ఆ విధంగా మీ తాతగారు నన్ను గుద్దుతూ డాన్స్ చేశారని చెప్పింది జయప్రద.

దీంతో ఆ ప్రోగ్రాం కి వచ్చిన వారంతా పగలబడి నవ్వారు. ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇదే సాంగ్ ను యమదొంగ చిత్రంలో నేను కూడా చేసాను. అప్పుడు నాతో మమతా మోహన్ దాస్ చేసింది.  కానీ ఆ టైంలో నేను సన్నగా ఉన్నాను కానీ అంతకు ముందులా లావు ఉంటే మమతా మోహన్ దాస్ పని కూడా మీలాగే అయి ఉండేది అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం వీరి మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr sr-ntr jayapradha yamagola

Related Articles