సాధారణంగా మనం బిర్యానీ వండేటప్పుడు అందులో ఆకులు తప్పనిసరిగా వేస్తాం. అయితే ఆకును టేస్ట్ కోసం వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయట.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం బిర్యానీ వండేటప్పుడు అందులో ఆకులు తప్పనిసరిగా వేస్తాం. అయితే ఆకును టేస్ట్ కోసం వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయట. మనిషికి ఎన్నో రకాల మేలు చేస్తుందట. మరి బిర్యానీ ఆకుల వల్ల మన శరీరానికి కలిగేటువంటి లాభాలు ఏంటి అందులో ఉండే విటమిన్స్ ఏంటి. అది కొవ్వును ఏ విధంగా కరిగిస్తుంది అనే వివరాలు చూద్దాం.. అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ బిర్యానీ ఆకు దివ్య ఔషధం.
ఈ ఆకును ఒకరోజు నీటిలో నానబెట్టి ఆ నీటిని మనం తాగితే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుందట. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి అధిక బరువును నియంత్రిస్తుందట. అయితే ఈ ఆకును నీటిలో నానబెట్టి అయిన తాగవచ్చు లేదంటే ఉడకబెట్టి అయిన తాగొచ్చు. దీనివల్ల వేగవంతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుతామట. జీర్ణ సమస్యలను పూర్తిగా దూరం చేస్తుందట.
శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ తొలగిపోయి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందట. ముఖ్యంగా మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఏమీ లేకుండా పూర్తిగా కరిగిపోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందట. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధమని చెప్పవచ్చు.