శ్రావణమాసం వచ్చిందంటే చాలు చాలామంది హిందువుల ఇంట్లో తప్పనిసరిగా పూజలు ఉంటాయి. ఈ శ్రావణ మాసం ఉన్నన్ని రోజులు కనీసం నీసు అనేది ముట్టరు. అలా శ్రావణమాసం చివరి శనివారం సెప్టెంబర్ 31న
న్యూస్ లైన్ డెస్క్: శ్రావణమాసం వచ్చిందంటే చాలు చాలామంది హిందువుల ఇంట్లో తప్పనిసరిగా పూజలు ఉంటాయి. ఈ శ్రావణమాసం ఉన్నన్ని రోజులు కనీసం నీసు అనేది ముట్టరు. అలా శ్రావణమాసం చివరి శనివారం సెప్టెంబర్ 31న రాబోతున్నది. ఈ రోజున కొన్ని పనులు చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు కుటుంబ దశ తిరిగిపోతుంది. ఈ శ్రావణ శనివారం రోజు మనం ఏం చేయాలో చూద్దాం.. శని త్రయోదశిలో వచ్చేటువంటి చివరి శ్రావణ శనివారం రోజు చాలా పవిత్రమైనది. శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం కూడా చాలా అరుదు.
ఇలా కలిసి రావడానికి గొప్ప పర్వదినంగా భావిస్తారు. ఇలాంటి ఈ పర్వదినాన ఈ చెట్టును తాకితే మీకున్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ శని దేవుడే మీ ఇంటికి కోట్ల రూపాయలు పంపిస్తాడు. అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు. మరి ఈరోజు శని దేవుడికి దీపం ఎలా వెలిగించాలి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఈ శని త్రయోదశి శ్రీమహావిష్ణువుకు, పరమేశ్వరునికి, ఎంతో ఇష్టమైన రోజు. చాలామంది శని దేవుడికి భయపడుతుంటారు. శని భగవానుడు నీతి, నియమం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు.
కాబట్టి ఆయనను భక్తితో నిబద్ధతతో కొలిస్తే మనకు ఎలాంటి కీడు చేయడు. కాబట్టి శని త్రయోదశి రోజున ఈ చెట్టును తాకితే ఒక గంటలో మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి రాజయోగం పడుతుందని పండితులు అంటున్నారు. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలట. మీ దగ్గరలోని ఆలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి తైలంతో శనీశ్వరుని పాదాలను అభిషేకించాలట. తైలం అంటే నువ్వుల నూనె. ఈ నూనెతో ఆయన పాదాలను కడిగిన తర్వాత నల్లని వస్త్రాన్ని శని దేవునికి కప్పి ఆ తర్వాత నైవేద్యంగా తమలపాకు తీసుకొని దానిమీద బెల్లం ముక్క సమర్పించి పూజ చేయాలి.
ఆ తర్వాత పూలతో అలంకరించాలి. ఆ తర్వాత శనీశ్వరుని స్తోత్రం చదువుకొని భక్తిలో మునిగిపోవాలి. ఆ తర్వాత దీపం వెలిగించాలి. అంతేకాకుండా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టు మొదట్లో దీపాన్ని పెట్టి, నిష్టగా పూజ చేయాలి. ఈ విధంగా ఆరోజు రావి చెట్టుకు పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా నిలబడతారట. కుటుంబంలో కూడా ఆనందంగా జీవిస్తారట. కాబట్టి శ్రావణ మాసం చివరి శనివారంలో ఈ పూజ చేసి అష్టైశ్వర్యాలు పొందాలని పండితులు తెలియజేస్తున్నారు.