Childrens: మీ పిల్లలు ఈ రోజుల్లో పుడితే వారి లైఫ్ కు తిరుగుండదు.!

మన ఇండియన్స్ ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. శాస్త్రం ప్రకారమే ప్రతి పని చేస్తారు. ఆ విధంగానే శాస్త్రం ప్రకారమే పిల్లలను కూడా కంటారు. ఎందుకంటే కొంతమంది వారికి నచ్చిన రోజులలో కంటే వారి భవిష్యత్తు 


Published Sep 20, 2024 07:41:12 AM
postImages/2024-09-20/1726798272_child.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియన్స్ ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. శాస్త్రం ప్రకారమే ప్రతి పని చేస్తారు. ఆ విధంగానే శాస్త్రం ప్రకారమే పిల్లలను కూడా కంటారు. ఎందుకంటే కొంతమంది వారికి నచ్చిన రోజులలో కంటే వారి భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు. అలా పుట్టే పిల్లలు ఏ రోజున పుడితే వారి లైఫ్ లో పూలబాట ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 సోమవారం:
 చంద్రుడి అనుగ్రహంతో  సోమవారం రోజున జన్మించిన పిల్లలు జీవితంలో అద్భుతంగా ఎదుగుతారట.  అంతేకాదు వారి లైఫ్ లో వచ్చే కష్టాలను ఎదుర్కొని విజయం సాధిస్తారట. ముఖ్యంగా వారు గెలిచిన తర్వాత గొప్ప కీర్తి పరీక్షలు పొందుతారని, జ్యోతిష్య పండితులు అంటున్నారు.

 మంగళవారం:
 ఈరోజున పుట్టిన పిల్లలు కుజుడి అనుగ్రహంతో  జీవితంలో మంచి పురోగతి సాధిస్తారట. ఈ రోజున పుట్టిన వారికి పోరాట పటిమ ఎక్కువగా ఉంటుందని, అదే వారిని జీవితంలో నిలబడేలా చేస్తుందట. 

 బుధవారం:
 బుధ గ్రహ ఆశీర్వాదంతో  బుధవారం రోజున జన్మించిన వారు  విద్య, విజ్ఞానంతో రాణిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తారు. జీవితంలో అత్యధిక సంపద కీర్తిని కూడా పొందుతారు. 

 గురువారం:
 బృహస్పతి ఈ రాశుల్లో జన్మించిన వారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. గౌరవం విలువ దక్కుతుంది. వీరు ఆధ్యాత్మికపరంగా ఆసక్తి కనబరుస్తారు. స్పష్టమైన ప్రాణాలికతో జీవితంలో ముందుకు వెళ్తారు. 

 శుక్రవారం:
 శుక్రుడి అనుగ్రహం వల్ల ఈరోజుల్లో పుట్టిన వారు సుఖసంతోషాలతో ఉంటారట.  వీరి జీవితంలో అన్ని ఆనందాలే ఉంటాయని ఈరోజును ఆడపిల్లలు పుడితే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 

 శనివారం:
 శని దేవుడి ఆశీస్సులతో శనివారం జన్మించిన వ్యక్తులు అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉంటారట. వీరు మంచి స్నేహభావాన్ని కలిగి ఉంటారట. చదువులో బాగా రాణిస్తారట.

 ఆదివారం:
 ఈరోజు జన్మించిన వ్యక్తులు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడమే కాకుండా  నీతి నిజాయితీ అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారట. చదువులో మొదటి స్థానంలో ఉండడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line astrology childrens child-born sunday friday monday saturday

Related Articles