పారిస్ ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. వరుసగా రెండో పతకాన్ని చేజిక్కించుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ ల జోడీ సత్తా చాటారు.
న్యూస్ లైన్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. వరుసగా రెండో పతకాన్ని చేజిక్కించుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ ల జోడీ సత్తా చాటారు. మూడో స్థానంలో నిలిచిన ఈ జోడీ ఒలంపిక్స్ లో రెండో కాంస్య పతకాన్ని నెగ్గారు. దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. మనుబాకర్ – సరబ్ జ్యోత్ సింగ్ ల జోడీ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా జోడీ 10 పాయింట్లతో ఆగిపోయారు. దీంతో 6 పాయింట్ల తేడాతో భారత జోడీ కాంస్యం దక్కించుకుంది.
కాగా.. ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించి మనుభాకర్ రికార్డు క్రియేట్ చేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా మను భాకర్ చరిత్ర సృష్టించారు. దీని కంటే ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే.