అనంతపురం జిల్లా వేదికగా జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కి తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యార్, రుతురాజ్ గైక్వాడ్ తెలియజేశారు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: అనంతపురం జిల్లా వేదికగా జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కి తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యార్, రుతురాజ్ గైక్వాడ్ తెలియజేశారు. అనంతపురంలో క్రికెట్ ఆడడం కొత్త అనుభూతిని ఇస్తుందని, జిల్లా కేంద్రంలో ఇలాంటి క్రీడా మైదానాలు ఉంటాయని అసలు ఊహించలేదని వారు తెలిపారు. అనంతపురంలో చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇక్కడ వంటకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక 20 రోజులు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తామని క్రికెటర్లు గైక్వాడ్, అయ్యర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఫర్ఫార్మెన్స్ ఆధారంగానే జాతీయ జట్టులో అవకాశం లభిస్తుందని వారు తెలియజేశారు. ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మ్యాచ్‌లు రెండు నగరాల్లో జరగనుంది. మొత్తం ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు జరగనున్నాయి.
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌కి మేము సిద్ధం - శ్రేయస్ అయ్యార్ & రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా క్రికెటర్లు pic.twitter.com/QLN8lXTpoC — News Line Telugu (@NewsLineTelugu) September 4, 2024
సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు - టీమ్ ఏ వర్సెస్ టీమ్ బీ జట్లు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు - టీమ్ సీ వర్సెస్ టీమ్ డీ జట్లు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా తలపడనుంది. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు - టీమ్ ఏ వర్సెస్ టీమ్ డీ జట్లు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు టీమ్ బీ వర్సెస్ టీమ్ సీ జట్లు అనంతపురంలోని ఏసీఏ గ్రౌండ్ వేదికగా ఢీ కొట్టానున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు - టీమ్ బీ వర్సెస్ టీమ్ డీ జట్లు అనంతపురంలోని ఏసీఏ గ్రౌండ్ వేదికగా తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు టీమ్ ఏ వర్సెస్ టీమ్ సీ జట్లు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా జరగనుంది.