ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విపరీతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు డ్యాములు పొంగుపొయిలాయి. ఈ వరద ప్రభావానికి చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విపరీతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు డ్యాములు పొంగుపొయిలాయి. ఈ వరద ప్రభావానికి చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎండలోకి నీరు చేరడం వల్ల కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి చేరుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం చాలామంది సినీ స్టార్లు రాజకీయ నాయకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు 50, 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా మహేష్ బాబు కూడా ఇరు రాష్ట్రాలకు సాయం అందించారు. ఇలా చాలామంది రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కోటి విరాళం అందించారు. ఇదే తరుణంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఇంతకుముందు ఆయన హీరోనే. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఆయనను ఆచరించలేదు కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు ఆయన ఆదరించే వారు ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపించడం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే హీరోనా తెలంగాణ రాష్ట్రానికి కాదా అంటూ విమర్శలు సంధిస్తున్నారు.