ఆయన 'ఎక్స్' (వేదికగా ఈరోజు ఉదయం ఒక పోస్ట్ పెట్టారు. "దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్. అయితే మీకు ఇంట్రస్ట్ ఉంటే దయచేసి షీరీల్స్ , ఫొటోలను నాకు మెయిల్ చెయ్యండి అంటూ చెప్పుకొచ్చాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రాహుల్ రామకృష్ణ ను పరిచయం చెయ్యనవసరం లేదు. అర్జున్ రెడ్డి, భరత్ అనేనేను , జాతి రత్నాలు లాంటి బెస్ట్ మూవీస్ చేసిన రాహుల్ ఇప్పుడు డైరక్టర్ గా తన లక్ ను పరిక్షించుకుంటున్నాడు. ఈ విషయం చెబుతూ ఆయన 'ఎక్స్' (వేదికగా ఈరోజు ఉదయం ఒక పోస్ట్ పెట్టారు. "దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్. అయితే మీకు ఇంట్రస్ట్ ఉంటే దయచేసి షీరీల్స్ , ఫొటోలను నాకు మెయిల్ చెయ్యండి అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మూవీకి ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నట్లు టాక్. నటనతో పాటు గతంలో రచయితగా, జర్నలిస్టుగా కూడా పనిచేసిన అనుభవం రాహుల్ రామకృష్ణకు ఉంది.తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సహాయ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయనకున్న ప్రత్యేక ప్రతిభ, దర్శకుడిగా కూడా ఆయన సినిమాల్లో కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నటుడిగా తనదైన ముద్ర వేసిన రాహుల్, దర్శకుడిగా ఎలాంఇ సినిమాలు చేస్తాడనేది చూడాలి.