ఆ జబర్దస్త్ లో తన నటనతో ఎంతో నవ్విస్తున్న తన్మయి పుట్టెడు దుఃఖంలో ఉంది. తన తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతోంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జబర్ధస్త్ అనగానే చాలామందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ ఓ రికగ్ననైజేషన్ ను ఇస్తుంది. ఎంతో మందికి పేరు, లైఫ్ ను ఇచ్చింది. అయితే ఆ జబర్దస్త్ లో తన నటనతో ఎంతో నవ్విస్తున్న తన్మయి పుట్టెడు దుఃఖంలో ఉంది. తన తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతోంది. తన తండ్రి అంతిమ యాత్ర దృశ్యాలను తన్మయి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “మా నాన్న ఎప్పుడూ నా సూపర్ హీరోనే. నాన్న అంటే ఒక ఎమోషన్.. నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నానంటూ పోస్ట్ చేసింది. ఇక అన్నీ నేనే..కొడుకు కూతురు అన్నీ నేను అయ్యి చేస్తానంటు పోస్ట్ చేసింది.
లేడీ గెటప్స్ తో తన్మయి బాగా పాపులర్ అయ్యింది. తను ఎక్కువ శాతం జబర్దస్త్ లోనే కనిపిస్తూ ఉంటుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎప్పుడో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకుంది. ఎప్పుడు నవ్వించే తన్మయి ...అలా కన్నీళ్లు పెట్టుకుంటూ తన తండ్రి కోసం ఏడ్వడం నెటజన్లకు కాస్త బాధపెట్టింది.
మీ ఫాదర్ ఆత్మకు శాంతినివ్వాలంటు కామెంట్లు పెడుతున్నారు. లైఫ్ లో భగవాన్ ఏం చేసినా మన మంచికే చేస్తారు. నీకు ఇప్పుడు కష్టసమయం .మంచి రోజులు కోసం వేచి ఉండంటు మరొకరు ఇలా కామెంట్లు చేస్తున్నారు.