JaniMaster:రే*ప్ చేసి.. ప్రైవేట్ పార్ట్స్ పై అలా.. మహిళా ఫిర్యాదు.! 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ తన కెరియర్ మంచి ఫిక్స్ లో ఉంది. అలాంటి జానీ మాస్టర్ తాజాగా వివాదంలో


Published Sep 16, 2024 10:26:14 AM
postImages/2024-09-16/1726462574_janimaster.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ తన కెరియర్ మంచి ఫిక్స్ లో ఉంది. అలాంటి జానీ మాస్టర్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళను లైంగికంగా వేధించాడని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. సదరు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే జానీ మాస్టర్ ఢీ అనే డ్యాన్స్ షో ద్వారా ఎంతో గుర్తింపు సాధించి టాలీవుడ్ లో అడుగు పెట్టారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొంది ఓ రేంజ్ కి ఎదిగాడు. అంతే కాదు ఈ మధ్యకాలంలో కేంద్ర సర్కార్ ప్రకటించినటువంటి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కూడా అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలుసు.  కెరియర్ మంచిగా కొనసాగుతున్న సమయంలో ఆయన మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణతో కేసు నమోదు కావడంతో  అది కాస్త వైరల్ గా మారింది.

అయితే సదరు మహిళ  జానీ మాస్టర్ నన్ను హైదరాబాద్, ముంబై, చెన్నై, పలు ప్రాంతాలకు షూటింగ్ వెళ్లిన సమయంలో అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నది. అంతేకాదు హైదరాబాదులోని తన ఇంట్లో కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె అన్నది. ఈ మేరకు పోలీసులు 323, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తున్న విషయం అందరికీ తెలుసు.

newsline-whatsapp-channel
Tags : news-line police girls dhee-show johnmaster dance-master case harrasment

Related Articles