viral: ఆ ఊరి పిల్లని పెళ్లి చేసుకుంటే 6 లక్షలు బహుమతి ..!

పెళ్లిళ్ల విషయంలో మాత్రం కొన్ని దేశాల్లో ఆడపిల్లలు ఎక్కువ ..మగపిల్లలు తక్కువ. ఉన్నవాళ్లు కూడా సిటీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారని ..జపాన్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.


Published Aug 31, 2024 07:52:00 AM
postImages/2024-08-31/1725071024_mainqimg51eed4ada799b61f5ff32334afa9719c.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు పిల్ల దొరకడమే కష్టంగా ఉంది. దొరికితే చక్కగా కట్నాలు ..కానుకలు...చక్కని ఉద్యోగం తో మహాలక్ష్మిలా నడుచువస్తుంది పిల్ల. అదే వంకలు పెట్టి వెతుకుతున్నారా..చచ్చినా దొరకడం లేదు. ఆడపిల్లలకు అలా ఉంది క్రేజ్. అయితే ఇప్పుడు ఆడపిల్ల విలువ తెలుసుకున్నారు జనాలు. ఒకప్పుడు ఆడపిల్లా అని దీర్ఘాలు తీసిన వారే ...ఇఫ్పుడు ఆడపిల్లలు పుడితే పార్టీలు చేసుకుంటున్నారు. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం కొన్ని దేశాల్లో ఆడపిల్లలు ఎక్కువ ..మగపిల్లలు తక్కువ. ఉన్నవాళ్లు కూడా సిటీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారని ..జపాన్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.


పల్లెలకు వెళ్లి వివాహం చేసుకుంటే లక్షల డబ్బులు పొందవచ్చు. జపాన్ రాజధాని టోక్యో నుంచి పల్లెలకు వెళ్లి వివాహం చేసుకోవాలని తెలిపింది. పల్లెల్లో సెటిల్ అయితే ...అక్కడే వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటే కనుక వారికి ఆర్ధిక సాయం , బిజినెస్ లోన్స్ , హౌసింగ్ లోన్స్ చాలా తక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో 6 లక్షల రూపాయిలు కూడా ఇస్తామని ప్రకటించింది. పల్లెల్లో జనాలను పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆలోచన చేశారట.


2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకంలో భాగంగా….టోక్యోలో ఉంటున్న వివాహం కానీ యువతులు, మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి సంబంధాలు చూసుకుంటే.. అందుకు అయ్యే మొత్తం ఖర్చులను అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకక టోక్యోలోని యువతులు పల్లెలకు వెళ్లి అక్కడి యువకులను వివాహం చేసుకుని, అక్కడే స్థిరపడిపోతే..దాదాపు 7 వేల డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయాల ఆర్థిక సాయం చేస్తానని...ప్రామిస్ చేసింది.


జపాన్‎లో జననాల నమోదు రికార్డ్ స్థాయిలో పడిపోతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే జననాల రేటు కనీసం 2.1గా ఉండాలి. గతేడాది అలా ఈ రేటు కూడా తగ్గిపోయింది.1.20 కి పడిపోయింది. జననాల రేటు పెంచేందుకు జపాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కొత్త స్కీమ్ భలే ఉందంటున్నారు నెటిజన్లు. కాని భారత్ లాంటి దేశంలో ఇలాంటి ఆఫర్లు పెద్దగా వర్కవుట్ కావనే చెప్పాలి. 
 

newsline-whatsapp-channel
Tags : marraige, viral-news male-tree girls villages

Related Articles