తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈయన కేవలం నటనలోనే కాకుండా డ్యాన్స్ తో కూడా అదరగొడతారు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్త పొద్దుగా
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈయన కేవలం నటనలోనే కాకుండా డ్యాన్స్ తో కూడా అదరగొడతారు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్త పొద్దుగా ఉండే ఎన్టీఆర్ ఆ తర్వాత సన్నగా బాడీ బిల్డర్ లా తయారయ్యారు. అలాంటి ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్, తన ఫ్యామిలీ తప్ప మరో విషయాల్లో వేలు పెట్టరు. అలాంటి ఎన్టీఆర్ పెళ్లికి ముందే ఒక హీరోయిన్ తో లవ్ లో పడ్డారట. వీరి లవ్ స్టోరీలో అనేక ట్విస్టులు ఉన్నాయని ఆయనే చెబుతుంటారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా ఎన్నో చిత్రాల్లో బల నటుడిగా చేసిన ఆయన చదువుల రీత్యా నటనకు స్వస్తిపలికి ఆ తర్వాత 23 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ తో లవ్ లో పడ్డారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ మీరంతా నేను లవ్ చేశానని వార్తలు రాసేస్తున్నారు. నా పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుంది నా ప్రొఫెషనల్ లైఫ్ వేరుగా ఉంటుంది. పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ కలిపి ఈ వార్తలు రాస్తే బాగుండదు అని చెప్పారు. నిజానికి నన్ను చేసుకునే అమ్మాయి నా కంటే ఎక్కువ మా అమ్మని చూసుకోవాలి. నేను చూసుకునే దాంట్లో కనీసం 50% అయినా మా అమ్మను చూసుకోగలిగితే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ సరసన అప్పట్లో అశోక్ అనే చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్ గా చేసింది. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చూసిందట. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత ఆమె అట్రాక్ట్ అయ్యారట. ఈ విషయం హరికృష్ణ తెలియడంతో వీరి ప్రేమ వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేసారట. దీంతో వీరి ప్రేమ వ్యవహారం అక్కడితో కట్ అయిపోయింది. ఆ తర్వాత లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.