Kalki 2898AD Twitter Review: ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్.. చూస్తే గూస్ బంప్స్.! 2024-06-27 08:11:39

న్యూస్ లైన్ డెస్క్: ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరో.ఈయన ప్రస్తుతం హాలీవుడ్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.  అలాంటి ప్రభాస్ కటౌట్ నుంచి మొదలు నటన వరకు ఏది చూసినా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ రాజమౌళి  ద్వారా బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైన చిత్రం కల్కి 2898AD..  ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై  అద్భుత టాక్ ను సొంతం చేసుకున్నది.

https://x.com/arnikhazra4/status/1805778202876592273

అలాంటి ఈ చిత్రం  భారతదేశ పురాతన ఇతిహాసాల నుండి  తీసుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించారు. విష్ణుమూర్తి పదవ అవతారంగా  భావించేటటువంటి కల్కి అవతారాన్ని ఈ చిత్రంలో చూపించారు. దాదాపుగా 600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో  హైటెక్నిక్ విజువల్స్,  అద్భుతమైన గ్రాఫిక్స్ టెక్నిక్స్ తో  హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తక్కువ కాకుండా రూపొందించారు దర్శకుడు. అంతేకాకుండా దేశంలోనే అత్యంత పేరుగాంచిన  నటీనటులు ఇందులో నటించారు.

https://x.com/SalimKh57633692/status/1805875080091910299

దాదాపు 5 సంవత్సరాలపాటు  ఈ చిత్రాన్ని  షూట్ చేసి థియేటర్లోకి విడుదల చేశారంటే మూవీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ చిత్రాన్ని అమెరికాతో పాటుగా అనేకచోట్ల ప్రీమియర్ షోలు కూడా వేశారు. అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసినటువంటి చాలామంది ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైంది. సినిమా మొదటి భాగం అద్భుతంగా ఉందని, ఇక ఇంటర్వెల్ తర్వాత  థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్క అభిమానికి గూస్ బంప్స్ వస్తాయని  అంటున్నారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క నటీనటులు  సరికొత్తగా ఆకట్టుకున్నారని.  మొత్తానికి ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచిపోనుందని ట్విట్టర్ వేదికగా సినిమా చూసిన జనాలు తెలియజేస్తున్నారు.