KIRAK RP: విడాకుల బాట పట్టిన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ…?

కిరాక్ ఆర్పీ మరో సారి సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యాడు.గత ఏడాది లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.


Published Oct 11, 2024 01:00:00 PM
postImages/2024-10-11/1728631838_samayamtelugu91819531.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కిరాక్ ఆర్పీ ఈ మధ్య గొడవల్లో ఫుల్ వైరల్ అవుతున్నాడు. జబర్ధస్త్ నుంచి కార్యక్రమంలో కాస్త ఫేమ్ వచ్చింది . ఆ ఫామ్ ను బిజినెస్ స్టార్ట్ చేసి వాడుకున్నాడు కూడా. అయితే మల్లెమాల వారితో తనకొచ్చిన విభేదాల కారణంగా ఈ సోషల్ మీడియాలో మల్లెమాలపై చాలా ఆరోపణలు కూడా చేశాడు.ఇటీవల కాలంలో తన బిజినెస్ పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వైకాపా పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


రీసెంట్ గా మరోసారి కిరాక్ ఆర్పీ మరో సారి సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యాడు.గత ఏడాది లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరిగి ఏడాది కూడా కాకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆర్పీ ఈ మధ్య ఫ్యామిలీ లైఫ్ కంటే ..రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనేది ఇద్దరి మధ్య గొడవలు రేపుతున్నాయట.


మరి ఆర్పీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్త చాలా రోజులు గా వైరల్ అవుతుంది అయినా ...ఆర్పీ చిన్న మాట తో కూడా ఖండించలేదు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce social-media kirak-arpi

Related Articles