రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయి సినిమా రెడీగా ఉంది. ఆల్రెడీ సాంగ్స్ , టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెరుగుుతన్నాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా "క" సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు దిల్ రుబా సినిమాతో రాబోతున్నాడు. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ఏ యూడ్లీ పిలిం బ్యానర్స్ పై విశ్వ కరుణ్ డైరక్షన్ లో కిరణ్ అబ్బవరం , రుక్సార్ ధిల్లాన్ జంటగా దిల్ రుబా సినిమా తెరకెక్కుతుంది.
రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయి సినిమా రెడీగా ఉంది. ఆల్రెడీ సాంగ్స్ , టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెరుగుుతన్నాయి. అయితే ఈ సినిమా నేడు ఫ్రిబ్రవరి 14 న రిలీజ్ కావల్సి ఉంది. కానీ చాలా కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. రీసెంట్ గా అయితే దిల్ రుబా సినిమా మార్చ్ 14 న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు.
వాలెంటైన్స్ డే మిస్ అయినా హోలీ పండక్కి వస్తామంటూ దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ చేస్తున్నామని హీరో కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. మరి క సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మరో హిట్ కొడతాడా చూడాలి.