పవన్ కళ్యాణ్ స్టైల్ తో కటౌట్ ఉంది. ఈ పోస్టర్ లో బద్రి సినిమా రిలీజ్ సమయంలో కథ అని ..వింటేజ్ స్టోరీతో తీస్తున్నట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సాంగ్స్ మధ్యలో పదాలతో సినిమాలు తీసే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ లో ఒకటయిన హే చికితా.. పదాన్ని సినిమా టైటిల్ గా తీసుకున్నారు. అమరావతి మూవీ మేకర్స్ సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ పై ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో భారీగా ఈ హే చికితా సినిమాని నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ హే చికితా టైటిల్ పోస్టర్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్ , డైరక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే హే చికితా సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ తో కటౌట్ ఉంది. ఈ పోస్టర్ లో బద్రి సినిమా రిలీజ్ సమయంలో కథ అని ..వింటేజ్ స్టోరీతో తీస్తున్నట్లు తెలుస్తుంది. పోస్టర్ మాత్రం అదిరింది. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని తెగ వైరల్ చేస్తున్నారు. మరి హే చికితా టైటిల్ తో ఎలాంటి సినిమా ని అందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా ఘూటింగ్ దశలో ఉంది.