Upasana : ప్రేమికుల రోజా అది ఆ వయసు వారికే ..మనకు కాదు !

ఈ రోజు ప్రేమికుల రోజు కదా...తన భర్తకు లవ్ విషెస్ చెబుతుందని అందరు అనుకుంటే తను మాత్రం డిఫరెంట్ పోస్ట్ వేశారు.


Published Feb 14, 2025 12:43:00 PM
postImages/2025-02-14/1739517217_upasanathumb167818873343316781887435061678188743506.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ చరణ్ వైఫ్ ..భలే జోకేశారు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందేగా. త‌మ ఫ్యామిలీ ఈవెంట్స్‌,అన్నింటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ప్రేమికుల రోజు కదా...తన భర్తకు లవ్ విషెస్ చెబుతుందని అందరు అనుకుంటే తను మాత్రం డిఫరెంట్ పోస్ట్ వేశారు.


'ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల కోసం. ఒక‌వేళ మీరు ఆ వ‌య‌స్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు ద‌య‌చేసి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కోసం వేచి ఉండండి' అంటూ ఒక‌ స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాస‌న‌. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక చెప్పకనే చెప్పేశారు..మనకు ప్రేమికుల రోజు కాదు...మహిళాదినోత్సవం ఇంపార్టెంట్ బిగులు అని . మరి ఉపాసన కదా...స్ట్రాంగ్ లేడీ ..స్ట్రాంగ్ ఆన్సర్ .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu socialmedia upasana lovers

Related Articles