మహాభారతం కాలంలో పాండవులు ఇదే గుడి దగ్గర బసచేశారని ప్రజలు నమ్ముతారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాండవులు వేల శివాలయాలు నిర్మించారు. వారి అజ్జాతవాసం టైంలో వేల శివలింగాలు నిర్మించారు. ఇందులో జమ్ము కాశ్మీర్ ఉధంపుర్ లోని కరీమ్చి ఆలయం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహాభారతం కాలంనాటి ఈ దేవాలయాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. మహాభారతం కాలంలో పాండవులు ఇదే గుడి దగ్గర బసచేశారని ప్రజలు నమ్ముతారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు . అందుకే ఈ దేవాలయాల సముదాయాన్ని " పాండవ ఆలయాలు" అని పిలుస్తారు.
ఉధంపుర్ నుంచి 12 కి.మీ దూరంలో బిరునాల నది ఒడ్డున ఉంది కరీమ్చి ఆలయం. ఇందులో ఏడు పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు క్రీ.శ. 8 నుంచి 9 శతాబ్దాలలో నిర్మితమయ్యాయి. పూర్తం కరిమ్చీ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని కుంటినగర్ గా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రాజాకేచక్ పరిపాలించేవారు. ఆయన అనుమతితో పాండవులు కరీమ్చి దేవాలయాలను నిర్మించారని పురాణాలు చెబుతున్నారు. ఇవి ఇండో -గ్రీక్ నిర్మాణ వాస్తు శైలిని ప్రతిబింబిస్తాయి. భక్తులు భారీగా వస్తున్నా సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ ఆలయాన్ని జమ్ముకశ్మీర్ చరిత్ర, సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ప్రజలు భావిస్తారు. ఇక్కడి స్థానికులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశం.