Lavanya:లావణ్య కీలక నిర్ణయం.. ఇక రాజ్ తరుణ్ కష్టమే.!

రాజ్ తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్తారు హీరోగా దూసుకుపోతున్న నటుడు. అలాంటి ఈయన గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి ప్రధాన కారణం ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని వదిలేసాడని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Published Jul 14, 2024 06:37:00 PM
postImages/2024-07-14/1720958167_rajtarun.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాజ్ తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్తారు హీరోగా దూసుకుపోతున్న నటుడు. అలాంటి ఈయన గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి ప్రధాన కారణం ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని వదిలేసాడని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే లావణ్య. అయితే వీరి ప్రేమ వ్యవహారంలో రోజుకు ఒక ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అయితే లావణ్యను రాజ్ తరుణ్ 2014లోనే వివాహం చేసుకున్నాడని  ఈ విషయం ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలకు తెలుసని అన్నది. అంతేకాకుండా తనకు రెండు సార్లు అబార్షన్ కూడా చేయించారని  చెప్పుకొస్తోంది.  ప్రస్తుతం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో తిరుగుతూ నన్ను దూరం పెట్టాడని ఆరోపణ చేస్తోంది. అంతే కాదు తనతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు మరియు తనకు అబార్షన్ చేయించినటువంటి రిపోర్ట్ అన్నింటినీ చూపిస్తూ   ఆమె కేసు వేసింది. నాకు రాజ్ తరుణ్ తప్ప వేరే ఎవరు వద్దని, ఆయన నాకు కావాలంటూ  కోరుకుంటుంది.

అంతేకాకుండా ఆమె  తరుణ్ కోసం ఆత్మహత్యయత్నం కూడా చేసుకోబోయింది సమయానికి పోలీసులు వచ్చి కాపాడడంతో బ్రతికిపోయిందని చెప్పవచ్చు. అలాంటి లావణ్య  నేను న్యాయం కోసం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తానని చెప్పుకొస్తోంది. తాను దక్కేవరకు  నిరాహార దీక్ష చేస్తానని అంటోంది.  అయితే రాజ్ తరుణ్ నేను డ్రగ్స్ తీసుకుంటానని చెప్పి నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. చూడాలి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu criminal-case rajtarun lavanya

Related Articles