Maheshbabu:డబ్బింగ్ ఆర్టిస్టుగా మహేష్ బాబు..ఏకంగా హాలీవుడ్ మూవీతో స్టార్ట్.!

మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. అలాంటి మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలా


Published Aug 21, 2024 06:24:00 PM
postImages/2024-08-21/1724242528_maheshbabu.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. అలాంటి మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలా సినిమాలు యాడ్స్, పలు బిజినెస్ లు తప్ప మహేష్ బాబు ఇంకో విషయంలో వేలు పెట్టరు. అలాంటి ఆయన ఏకంగా ఒక హాలీవుడ్ చిత్రానికే డబ్బింగ్ చెప్పబోతున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. హాలీవుడ్ లో 2019లో రిలీజైనటువంటి మూవీ ది లయన్ కింగ్. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ హీట్ అయింది.

అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా  మరో చిత్రం వస్తోంది.  ఇందులో నటుడు ముసఫా ది లయన్ కింగ్ పేరుతో మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో ముసప పాత్ర తెలుగు వెర్షన్ కు  సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఈనెల 26వ తేదీన విడుదల చేయనున్నారట.

ఈ మూవీ ముసప పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ బాబు మాట్లాడుతూ.. డిస్నీ అంటే నాకెంతో గౌరవం ఉన్నది..  ముసప తన కుమారుడిని నడిపించే ఫాదర్ గానే కాకుండా ఒక ఫారెస్ట్ కు గొప్ప రాజుగా అందరినీ కాపాడతాడు. డిస్నీతో కలిసి పనిచేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం.  దీన్ని నా పిల్లలతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తాను, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన తెలుగులో ముసప ది లయన్ కింగ్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై నా కుటుంబంతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : holly-wood newslinetelugu mahesh-babu musafa the-lion-king dubbing-artist

Related Articles