సోషల్ మీడియా ఇప్పుడు దారుణంగా ఉంది. ఏది హాస్యం...ఏది అసభ్యత అనే తేడా తెలికుండా వీడియోలు చేస్తున్నారు. అంతేనా ..ఫన్ ...ప్రాంక్ పేరుతో నోటికి వచ్చిన బాష వాడుతున్నారు.వీటిపై రియాక్ట్ అయ్యారు మంచు మనోజ్. ఓ కంటెంట్ క్రియేటర్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రణీత్ అనే నటుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి చేసిన ఓ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై ప్రణీత్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. చాలా వల్గర్ లాంగ్వేజ్ తో ...మాట్లాడాడని అన్నారు. దీనిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంతకు ముందే స్పందించారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క్ కూడా రియాక్ట్ అయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా ఇప్పుడు దారుణంగా ఉంది. ఏది హాస్యం...ఏది అసభ్యత అనే తేడా తెలికుండా వీడియోలు చేస్తున్నారు. అంతేనా ..ఫన్ ...ప్రాంక్ పేరుతో నోటికి వచ్చిన బాష వాడుతున్నారు.వీటిపై రియాక్ట్ అయ్యారు మంచు మనోజ్. ఓ కంటెంట్ క్రియేటర్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రణీత్ అనే నటుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి చేసిన ఓ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై ప్రణీత్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. చాలా వల్గర్ లాంగ్వేజ్ తో ...మాట్లాడాడని అన్నారు. దీనిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంతకు ముందే స్పందించారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క్ కూడా రియాక్ట్ అయ్యారు.
సంవత్సరం క్రితం, నేను ఏపీ, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటానికి అతడి మద్దతు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాను. అతడి ఛానల్ పాప్యులారిటీ కారణంగా సమాజంపై మరింత మంచి ప్రభావం పడుతుందని అనుకున్నాను. కాని దీనికి అతను రెస్పాండ్ అవ్వలేదు.. ఆరోజు నాకు తెలీదు ...ఒక వేళ అతను నన్ను అప్రోచ్ అయితే ఇంకా పెద్ద తప్పు చేసినవాడిని అయ్యేవాడిని అంటూ రెస్పాండ్ అయ్యారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా .... పిల్లల, మహిళ భద్రతకే మన తొలి ప్రాధాన్యం. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా, క్రియారహితంగా ఉండటం సరికాదు. ఇలాంటి వాళ్లు సమాజానికి చాలా ప్రమాదం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎం, డిప్యుటీ సీఎంను కోరుతున్నాను’’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మంచు మనోజ్ .