మంచు మనోజ్ ఇవాళ పోలీసులను ఆశ్రయించినట్టు... కాదు, మనోజే నాపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్టు కథనాలు వచ్చాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మోహన్ బాబు ఫ్యామిలీ లో ఏదో జరుగుతుంది. ఆస్తి గొడవలా..లేక పదవుల కోసం గొడవలా..ఎందుకు మంచు మనోజ్ అందరికి దూరమవుతున్నారు. తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశాడంటూ మంచు మనోజ్ ఇవాళ పోలీసులను ఆశ్రయించినట్టు... కాదు, మనోజే నాపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్టు కథనాలు వచ్చాయి.
ఈ వార్తను మంచు కుటుంబం ఖండించింది. మేమంతా బాగున్నాం. మీరు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే, మంచు మనోజ్ కాలికి గాయంతో ఆసుపత్రిలో చేరడం మీడియా వార్తలకు బలాన్ని ఇచ్చింది. హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంచు మనోజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన సరిగా నడవలేకపోతున్న స్థితిలో, భార్య మౌనికతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. మరో మనిషి సాయంతో నడవడంతో గొడవ గట్టిగా జరుగుతుందనే అనుమానిస్తున్నారు మనోజ్ ఫ్యాన్స్.