ఒలంపిక్స్ లో ఇండియా ఎప్పుడు బోణి కొడుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో మనుభాకర్ బోనీ కొట్టడమే కాదు ఒకేసారి రెండు పథకాలు గెలుచుకుంది. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ డెస్క్: ఒలంపిక్స్ లో ఇండియా ఎప్పుడు బోణి కొడుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో మనుభాకర్ బోనీ కొట్టడమే కాదు ఒకేసారి రెండు పథకాలు గెలుచుకుంది. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఇండియాలో ఒకేసారి రెండు పథకాలు సాధించినటువంటి అథ్లెట్స్ లేరు. దీంతో మనుబాకర్ సాధించి చూపించింది. ఆమె 2020 టోక్యో ఒలంపిక్స్ చేదు అనుభవం నుంచి, ఎంతో గుణపాఠం నేర్చుకుని ఈసారి దేశం గర్వపడే విధంగా పథకాలు సాధించి తన లాంటి యువతకి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
ఆమె సాధన వెనక ఒక చిన్న కారణం ఉందట. ఆమె ఒక టాటూ వేసుకుందట. అది చూసినప్పుడల్లా ఆమె ఒలంపిక్స్ లో మెడల్ కొట్టాలి సాధించాలనే సాధన గుర్తుకు వచ్చేదట. అయితే మనుభాకర్ 2020 టోక్యో ఒలంపిక్స్ లో దారుణంగా ఓటమిపాలైంది. దీనికి కారణం ఆమె గన్ లో సాంకేతిక లోపం అని చెప్పింది. అయినా ఆమె ఎట్టి పరిస్థితుల వెనక్కి తగ్గకుండా 2024 ఒలంపిక్స్ లో ఒకేసారి రెండు పథకాలు సాధించింది. అయితే ఆమె ఇంతటి ఘనత సాధించడానికి ఆ టాటూయే కారణమని, మనుబాకర్ మెడ వెనుక భాగంలో' స్టిల్ ఐ రైజ్' అనే టాటూ ఉంది.
ఇది కేవలం పదాలు కావని అమెరికా కవి మాయ ఆ జైలు రాసిన కవితా అని దాని గురించి మనుభాకర్ ఇంటర్వ్యూ లో తెలియజేస్తూ "స్టిల్ ఐ రైజ్" అనేది కేవలం పదాలు కావని మన వైఫల్యాలను ఎదుర్కొన్న సమయంలో మీ విలువలను చాటే నినాదం అని తెలియజేసింది. ఈ పదాలే దృఢ సంకల్పం ప్రేరణ అందిస్తాయని ఆమె చెప్పింది. అయితే ఈమె 16 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్, సాధించిన అతి చిన్న వయసు భారత క్రీడాకారిణిగా పేరుపొందింది.
ఈ విధంగా మానుభాకర్ టోక్యో ఒలంపిక్స్ కు ముందే అన్ని వరల్డ్ కప్ లో కలిపి 9 స్వర్ణాలు, రెండు రజతాలు గెలిచింది. 2020లో ఒలంపిక్స్ లో పథకం సాధిస్తుందని అందరూ అనుకున్నారు కానీ తృటిలో మిస్సయింది. ఇక 2022 డిసెంబర్ లో ఒక టాటూను వేయించుకున్నారు. అదే తన క్రీడలకు మలుపు తిప్పిందని ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తారు. టాటూ వేయించుకున్న తర్వాత పట్టుదల, శ్రమతో చాలా కఠిన కసరత్తులు చేసి 2024 ఒలంపిక్స్ లో రెండు పథకాలు సాధించింది.