అనుభవజ్జడైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుభవం లేని పేసర్లతో బరిలోకి దిగడంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో అనుభవజ్జడైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల్లో ఆడతాడని, ఈ మేరకు త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. షమీ ఫిట్ నెస్ షాకింగ్ వార్తలు నడుస్తున్నాయి. షమీ ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఫెయిల్ అయ్యారనే టాక్ నడుస్తుంది. 5 రోజుల పాటు జరిగే టెస్ట్ క్రికెట్‌కు షమీ ఇంకా సంసిద్ధంగా లేడని తేలిందట. ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా బరోడా-బెంగాల్ జట్ల మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో షమీ ఆడనున్నాడని, అక్కడ మరోసారి అతడి ఫిట్‌నెస్, మోకాలి సమస్యలను పరీక్షించనున్నారని పేర్కొంది.
మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత బెంగాల్ జట్టు తరపున షమీ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మీడియా సమావేశంలో స్పందించాడు. షమీ 100 శాతం ఫిట్ నెస్ ఉంటే తప్ప అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. షమీ ఆడతానంటే ..ఎప్పుడు ఓకే కాని ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ అవ్వాలంటూ చెప్పారు రోహిత్.