Mokshagna: బాలకృష్ణతో కానిది కొడుకు చేసి చూపిస్తున్నాడా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికె 109 సినిమాలో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజుల ముందు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన రిజల్ట్ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాక ఫ్రీ అయిపోయారు.


Published Aug 05, 2024 04:30:00 PM
postImages/2024-08-05/1722854206_balakrishnamokshagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికె 109 సినిమాలో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజుల ముందు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన రిజల్ట్ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాక ఫ్రీ అయిపోయారు. మళ్ళీ సినిమాల బాట పట్టారు.అయితే అలాంటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఉండబోతుందని గత కొద్ది సంవత్సరాల నుండి మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఆయన వచ్చింది లేదు పోయింది లేదు అన్నట్లు పరిస్థితి ఉండేది.

కానీ స్వయంగా మోక్షజ్ఞ నే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను అని క్లారిటీ ఇవ్వడంతో మోక్షజ్ఞ ఈ ఏడాది ఎంట్రీ కన్ఫామ్ అని నందమూరి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి శ్రీను తో ఉంటుందని కొంతమంది అనుకుంటే మరికొందరేమో యాక్షన్ డైరెక్టర్ల పేర్లు తెరమీదకి తీసుకువచ్చారు.కానీ వారందరినీ పక్కనపెట్టి బాలకృష్ణ తన కొడుకుని పరిచయం చేయడానికి యంగ్ డైరెక్టర్ని  ఎంచుకున్నారు. ఇక ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక జానర్ లో ఉంది. అన్ని ఒకే జానర్లో తీయలేదు. అలా డిఫరెంట్ స్టోరీలు తీస్తూ ఇండస్ట్రీలో స్టార్ అయిపోయిన ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ అంటే కచ్చితంగా సినిమా హిట్టే అని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ గురించి ఓ టాక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే తండ్రి బాలకృష్ణ చేయనిది కొడుకు మోక్షజ్ఞ చేసి చూపిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు జనాలు.ఇక అదేంటంటే.. మోక్షజ్ఞ హీరోగా రాబోయే సినిమాలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా చేయబోతున్నట్టు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఒక రూమర్ వినిపిస్తోంది.

 ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి బాలకృష్ణ కి సాధ్యం కానిది కొడుకు మోక్షజ్ఞకు సాధ్యమవుతుంది.ఎందుకంటే బాలకృష్ణ శ్రీదేవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ జనాలు చెబుతారు. కానీ బాలకృష్ణ చేయకపోయినా మోక్షజ్ఞ గనుక ఖుషి కపూర్ తో రొమాన్స్ చేస్తే మాత్రం బాలకృష్ణ చేయనిది మోక్షజ్ఞ చేసి చూపిస్తాడు. ఇక ప్రస్తుతం ఖుషి కపూర్ అక్క జాన్వీ కపూర్ దేవర సినిమాలో ఎన్టీఆర్ తో నటిస్తోంది.ఇక ఖుషి కపూర్ కూడా మోక్షజ్ఞతో నటిస్తే మాత్రం అన్నయ్యతో అక్క ఇండస్ట్రీకి పరిచయమైతే తమ్ముడితో చెల్లి ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna devara prashanth-varma janhvi-kapoor sridevi khushi-kapoor

Related Articles